ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 7: సోమ వారం
__________________________________________
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, 22A సహా ప్రజా సమస్యలపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు బిజెపి మీడియా ప్యానలిస్ట్ ప్రభ గౌడ్ ఆద్వర్యం లో సోమవారం చలో అసంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రభ గౌడ్ నేతృత్వం లో అఫ్జల్ గంజ్ నుండి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు ర్యాలీగా అసంబ్లీ వైపు బయలు దేరారు. దీనితో పోలీసులు వారిని అడ్డుకోవడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్బంగా ఇరు వర్గాల మధ్య తోపులాట మధ్య ప్రభ గౌడ్ తో పాటు పలువురు నాయకులు కార్య కర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా ప్రభ గౌడ్ కాలికి గాయమైంది. వెంటనే ఆమెను నాంపల్లి లోని కేర్ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్బంగా ప్రభ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని,, 22A ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు మాత్రమే కాదు ప్రజాస్వామ్య బాధ్యత కూడా అని అన్నారు.
₹15000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా 40 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తూ, వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ తీరును ప్రభ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
విద్యార్థుల హక్కుల కోసం..ధర్నా చౌక్‌లో ‘విద్యార్థి మహాధర్నా’కు పిలుపునిస్తే భయపడి అనుమతి నిరాకరణ!అసెంబ్లీ ముట్టడికి వెళ్తే పోలీసుల చేత అక్రమ అరెస్టులు.. గృహ నిర్బంధాలు..పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు.విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు..విద్యార్థుల హక్కులు సాధించే వరకు..కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది!తెలంగాణలో ప్రజాస్వామ్య నిరసనలను హౌస్ అరెస్టులు, ముందస్తు నిర్బంధాలతో అణచివేయడం సరికాదు.చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలందరినీ ప్రభుత్వం వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ప్రభ గౌడ్ డిమాండ్ చేశారు.















