ఈతరం భారతం యాదాద్రి భువనగిరి : సోమవారం 14
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించడమే ఎంతో మేలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని మార్కండేయ ఆలయం ఆవరణలో ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సూచన మేరకు ఆ సంఘం రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గత దశాబ్ద కాలంగా అంజయ్య స్వామి ఎంతో శ్రమకోర్చి తన స్వంత ఖర్చుతో మట్టి విగ్రహాలను తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. అంజయ్య స్వామి పర్యావరణ సేవా దృక్పథం అభినందనీయమని ఆయన తెలిపారు. మండల చేనేత సహకార సంఘం చైర్మన్ దాసి శంకర్, బీజన భాస్కర్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.















