EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కార్వాన్లో సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ దే విజయం- ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రకృష్ణ

కార్వాన్లో సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ దే విజయం- ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రకృష్ణ 

హైద్రాబాద్ నవంబర్ 14 ,( ఈతరం ఇండియా న్యూస్)ఈసారి ఎన్నికల్లో కార్వాన్ నియోజకవర్గంలో సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకే అఖండ విజయం దక్కనుందని కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రకృష్ణ జోస్యం చెప్పారు. మంగళవారం జియాగూడ డివిజన్లోని రంగనాథస్వామి ఆలయం వద్ద నుంచి ఎన్నికల ఇంటింటి ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. రంగనాథ్ నగర్, మల్లన్నవీధి, లక్ష్మీనర్సింహ్మనగర్ కాలనీ, వెంకటేశ్వరనగర్, ఇక్బాల్ గంజ్, దుర్గానగర్ ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మిత్రకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో గడప గడపకూ అభివృద్ధి- సంక్షేమ పథకాలను అందించారని, ఈ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క తమ బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. కార్వాన్లో మతతత్త్వ మజ్లిస్, బీజేపీ పార్టీలకు స్థానిక ప్రజలు స్వస్తిపలుకనున్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యావేత్త బి. గాలయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కావూరి వెంకటేశ్, యాద శ్రీనివాస్ గుప్తా, రంగ పరంధాములు, జియాగూడ నేతలు నరహరిచారి, సి బాబు, నర్మద, మంతటి నర్సింహ్మ, కెశోర్, ఉమేష్, నర్సింగారావు, శశికాంత్ రావు, వెంకటేశ్, కేశవ్, సంగీత -పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. |

Related News

Select the Topic
Scroll to Top