EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దానం నాగేందర్ అనర్హతపై కీలక ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు!

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 19

___________________________________

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందుగానే కెవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు, ఖైరతాబాద్ ఉప ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సెప్టెంబర్ 18న తీర్పు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన అనర్హుడని ప్రకటిస్తూ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related News

Select the Topic
Scroll to Top