EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారత్‌లో డెంగ్యూ టీకా ‘క్యూడెంగా’ త్వరలో విడుదల

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 19

________________________________

జపాన్ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ (TAK-003) భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ టీకా పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. CDSCO నుంచి అనుమతి లభించిన ఈ వ్యాక్సిన్, 2027 ప్రారంభం నాటికి మార్కెట్‌లోకి వస్తుంది. 4 నుండి 60 ఏళ్ల వయస్సు వారు దీనిని తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చే ఈ టీకా, డెంగ్యూ నాలుగు సెరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. గతంలో డెంగ్యూ వచ్చిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ముందస్తు పరీక్షలు లేకుండా దీనిని నేరుగా వేసుకోవచ్చు.

Related News

Select the Topic
Scroll to Top