EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బాలుడిపై కోతుల గుంపు దాడి.. కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి…

 

అహ్మదాబాద్‌ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్ );: కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాల్కి గ్రామంలోని గుడి సమీపంలో పదేళ్ల దీపక్ ఠాకూర్‌ తన స్నేహితులతో కలిసి ఆడుతున్నాడు. ఇంతలో ఒక కోతుల గుంపు అతడిపై దాడి చేసింది. ఆ బాలుడి మీదకు దూకిన కోతులు గోళ్లతో ఆ చిన్నారి కడుపు చీల్చి పేగులను బయటకు తీశాయి.కాగా, స్పందించిన స్థానికులు కోతుల దాడి నుంచి ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఆ గ్రామంలో జనంపై కోతులు దాడి చేయడం ఇది మూడో సంఘటన. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆగ్రహంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. కోతులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top