ఈతరం భారతం న్యూ డిల్లి సెప్టెంబర్ 29:
________________________________
రాహుల్ గాంధీని దేశ ప్రజలు తూ.. అనిఅసహ్యించుకుంటున్నారు.రాహుల్ గాంధీ కాదు ఆయన జేజమ్మ దిగి వచ్చిన మోడీ గారిని ఢీకొట్ట లేరని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.మంగళవారం ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి,రితేష్ రాథోడ్ తో కలిసి డిల్లీ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సమస్యలను ప్రస్తావించి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైంది. అసహనంతో అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరుగుతూ భారతజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేసి దిగజారేలా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు తూ.. అని అసహ్యించుకుంటున్నారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రావడం లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఓటర్ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేసిందే రాహుల్ గాంధీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది కొత్తది కాదు, నిరంతర ప్రక్రియ. స్వతంత్రం వచ్చిన తర్వాత పది సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరిగింది. చివరి సారిగా 2021లో జరిగింది. దేశంలో అనేక కమిటీలు ఎన్నికల సంస్కరణల కోసం వేయబడ్డాయి. 1975లో జస్టిస్ తర్కొండే కమిటీ, 1980 లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ,1990లో దినేష్ గోస్వామి కమిటీ,జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీలు అనేక సిఫార్సులు చేశాయి.
1952 మొదటి ఎలక్షన్ నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికల సంస్కరణలు వచ్చాయి.. అందులో భాగమే ఈవీఎంలు కూడా. evm లను మొట్టమొదటిగా తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అని ఒకపక్క గొప్పగా చెప్తారు.. మరోపక్క evm మీద ఆరోపణలు చేస్తారు.
2017 లో వివి పాడ్ తీసుకు వచ్చింది నరేంద్ర మోదీ గారు. గెలిస్తే ఒక పాట ఓడిపోతే మరొక పాట పాడటం కాంగ్రెస్ అలవాటు. సర్ ప్రక్రియ తర్వాత తమిళనాడులో విజయ్ గెలిచారు. కేరళలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మేము అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని ఓట్లకి వెళ్ళాము.. నిజంగానే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలిగితే 400 సీట్లు తెచ్చుకొనే వాళ్ళం కదా ? బీజేపీ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు బీజేపీ పని అయిపోయింది అన్నారు.
కానీ 2026లో.. ఏ సర్వే చూసినా మోడీ గారిని దేశంలో ఎవరూ ఢీకొట్టే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ కాదు ఆయన జేజమ్మ దిగి వచ్చిన మోడీ గారిని ఢీకొట్ట లేరు అనే భావన వచ్చింది.
మోదీ గారు వచ్చిన తర్వాతనే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ పతాక రెపరెపలాడుతుంది. రెండు లక్షల కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్న దేశంలో 12 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయగలుగుతున్నాము.జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు..ఎస్ ఐ ఆర్ ద్వారా చనిపోయిన వారి ఓట్లను తొలగించడం తప్పా? షిఫ్టింగ్ ఆఫ్ ఓట్లను చేయడం తప్పా ?
ఎన్నికల్లో ఊర్లలో 90 నుంచి 92% ఓట్లు పోలవుతాయి. కానీ పట్టణాల్లో ఎందుకు జరగడం లేదు అంటే వాళ్ళకి రెండు చోట్ల ఓట్లు ఉండడం కూడా ఒక కారణం.మొన్న జరిగిన ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటులో పోలైన ఓట్లు 52 శాతం. ఎక్కువ శాతం కాకపోవడానికి కారణం ఊర్లలో ఓటు ఉంటది, పట్టణంలో ఓటు ఉంటది, ఏపీలో ఓటు ఉంటుంది.. హైదరాబాదులో ఉంటుంది. గుజరాత్ లో ఉంటుంది మల్కాజిగిరిలో ఉంటుంది. చనిపోయిన వారు, షిఫ్ట్ అయిన వారు, రెండు దిక్కుల ఓట్లు ఉన్న వారిని మార్చి ఒక మనిషికి ఒకే దగ్గర ఓటు ఉండాలి అనే నిబంధన తీసుకురావడం తప్పా ? అని ప్రశ్నించారు.
చరిత్రలో ఎలక్షన్ కమిషన్ ను అత్యధికంగా మిస్ యూస్ చేసిన పార్టీ కాంగ్రెస్.1975లో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని కాపాడిన ఎమ్మెస్ గిల్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది మీరు. దొంగలు మీరు. అనేక తప్పులు చేసింది మీరు. తప్పులను సరి చేస్తుంటే అక్కసుతో మాట్లాడుతున్నారు.
బిజెపి ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను, కష్టాన్ని నమ్ముకుంది.. దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. దేశం ఫస్ట్.. తర్వాతనే పార్టీ.. ఆ తర్వాతనే వ్యక్తి, ఇదే మా సిద్ధాంతం. మావి పవర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ కావు పీపుల్ ఓరియెంటెడ్ పాలిటిక్స్. కాంగ్రెస్ చేస్తున్న పిచ్చి పనులకు ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ.. చౌకబారు ప్రయత్నాలు మానుకొని.. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రతిపక్ష పార్టీగా పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాను.
ఓటు చోరీ పేరుతో బీహార్లో ఎన్నికలకు పోతే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా తుడిచి పెట్టుకొని పోయాయి. ఇదే నినాదంతో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మా మోడీ కల.. కానీ దానిని రాహుల్ గాంధీ నిజం చేయబోతున్నారన్నారు.















