ఈతరం భారతం 30-09-2026 జిల్లా వైద్యారోగ్య శాఖ, ఖమ్మం :
_________________________________________________
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (DMHO) డాక్టర్ రామారావు గారు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కేంద్రంలో జరుగుతున్న సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేంద్రంలోని ఓపీ, ల్యాబ్ మరియు వ్యాక్సినేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం వైద్య సిబ్బందికి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ (Immunization Schedule) మరియు టీకాల అనంతరం చాలా అరుదుగా తలెత్తే దుష్ప్రభావాల (AEFI – Adverse Events Following Immunization) సమర్థవంతమైన నిర్వహణపై పలు కీలక సూచనలు చేస్తూ రీ-ఎడ్యుకేట్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో గారు మాట్లాడుతూ గర్భిణుల సంరక్షణ కోసం ఏఎన్‌సీ (ANC) రిజిస్ట్రేషన్ల శాతాన్ని మరింతగా పెంచాలని ఆదేశించారు.పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (AAM) కేంద్రాల్లో సేవల వివరాలను (Service Delivery) ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు.ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు గుర్తింపు మరియు నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాల (Blood Donation Camps) నిర్వహణకు ప్రత్యేక చొరవ చూపి, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మామిళ్లగూడెం యూపీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ శ్రావ్య, సీహెచ్‌వో సంధ్యారాణి, నర్సింగ్ ఆఫీసర్ నాగమ్మ, ఫార్మసిస్ట్ పి. లక్ష్మి, అకౌంటెంట్ నాగాలక్ష్మి, ఏఎన్‌ఎంలు రాజేశ్వరి, హేమలత, దయామణి, నాగరాణి, చంద్రమణి, భవాని మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.















