EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 30 :

___________________________________

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.వారి ప్రజ్ఞాపాట వాలను గుర్తించి వారికి సముచిత ప్రోత్సాహాన్ని అందిస్తే వారిలో విజ్ఞానదీపికలువెలుగొంది వారి జీవితాలు ప్రకాశ వంతమవ్వడమేగాక దేశ భవిష్యత్తుకు పునాది వేసిన వాళ్లమవుతామని” చిల్డ్రన్స్ వరల్డ్ ” ప్రతి మూడు నెలలకు ఒక సంచికను తీసుకుని వస్తోంది.ఇందులో ఎక్కువభాగం రచనలు బాలలు రచంచినవే. వాటితోబాటు పెద్దల రచనలు కూడా చేర్చి ప్రచురించిప్రోత్సాహాన్ని అందిస్తోంది.ఈ నెల సంచికను సర్వాంగసుందరంగా ముద్రించి ఆ సంచికను శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వావిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు  చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న సమయంలో ఇటువంటి బాలల పత్రికను చిల్డ్రన్స్ వరల్డ్ సంస్థ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండ తీసుకరావడం ఎంతో ముదావహమని, ఇటువంటి కృషి చేస్తున్న సంచిక మేనేజింగ్ ఎడిటర్ మక్కపాటి చంద్రశేఖర్ రావు, చీఫ్ ఎడిటర్ పి యన్. భానుప్రకాశ్ కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య వెలుదండ నిత్యానంద రావు తోబాటు చిల్డ్రన్స్ వరల్డ్ చీఫ్ ఎడిటర్ పి. యన్. భాను ప్రకాష్, నిజాంపేటలోని రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి దీపిక, తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి కవిత, స్కూల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి కామేశ్వరి, లాల్ గడి మలక్ పేట్ హిందీ పండిట్ శ్రీమతి పాముల మాధవి, ఇన్ వెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్, షాజహాన్, జర్నలిస్ట్ కిరణ్ ప్రభృతులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top