EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెండ్!

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5:

________________________________

ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యపై వేటు పడింది. పలు అవినీతి, అక్రమ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.కొన్ని రోజుల క్రితం సస్పెన్షన్ వేటు తప్పదన్న సమయంలో కృష్ణయ్యపై అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.విచారణలో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభించడంతో కృష్ణయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.అయితే, కృష్ణయ్యపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

Select the Topic
Scroll to Top