EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రైతు సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్లే పోగు విజయరాజు

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 5:

_______________________________

తెలంగాణ రైతుల సంక్షేమం, అభివృద్ధి మరియు రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రైతు సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్లే పోగు విజయరాజు నియమితులైనారు ఈ మేరకు తెలంగాణ రైతు సంక్షేమ సేవ సంఘం వ్యవస్తాపక అధ్యక్షులు కొమ్ము ప్రీమ్ సాగర్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మల్లే పోగు విజయరాజు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటూ, రైతుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంక్షేమ సేవ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, రైతుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తానన్నారు.రైతు సంక్షేమమే మన లక్ష్యం – రైతుల అభివృద్ధే తన ధ్యేయం అని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top