ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 5:
______________________________
తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు అబిడ్స్ లోని బొగ్గుల కుంట లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ 157 వ జయంతి మరియు అంతర్జాతీయ అహింస దినోత్సవం ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు సమాజ సేవకులకు మహాత్మా గాంధీ శాంతి పురస్కారాలు 2026 ప్రదానం చేయనున్నట్లు ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ వేడుక పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త మరియు సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి అంజనీ దేవి, తోపాటు డాక్టర్. వి .దీపిక, మడిగల విజయభాస్కర్ రెడ్డి, గాజుల అంజయ్య, డాక్టర్ ఎం. సంగీతారెడ్డి, డాక్టర్ రవితేజ, డాక్టర్ ఎం. రాజ్ కుమార్, డాక్టర్ పి. అశ్విని రెడ్డి, ఎస్. మధుసూదన్, పి. సుందర్ ,తరుణ్ కుమార్ మెహతా, ఎడ్ల బాలరాజ్, కుంబర్తి రవీందర్, ఎం కిరణ్ మై, మిత్ర జాన్ బునియన్, మహమ్మద్ సాహెబ్ రూమి, కె.జోజి రెడ్డి, కె. ప్రపూర్ణ రెడ్డి ,జమీల్ రబ్బాని లకు మహాత్మా గాంధీ శాంతి పురస్కారం ఎంపికైనట్లు తెలిపారు.















