ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 5:
_______________________________
డి ఎన్ టి 51 కులాల కు డి ఎన్ టి సర్టిఫికెట్ లు తహసిల్దార్ కార్యాలయాల నుండి ఇప్పించాలని అలాగే అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల పథకం డిఎన్టియులకు కూడా వర్తింపచేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు కోల శీను పూసల ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా కోల శీను మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడిన 1857 సిపాయి తిరుగుబాటుదారులు అణిచివేయడానికి 1860లో ఇండియన్ పీనల్ కోడ్ను బ్రిటిష్ ప్రభుత్వం తేవడం అయినది . 1871లో సిటీ యాక్ట్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ద్వారా ప్రజలను అణచివేసినరు .భారత దేశ స్వాతంత్రంలో పోరాడిన ప్రజలకు భారత రాజ్యాంగంలో సంచార జాతుల పేరు లేకపోవడం శోచనీయమన్నారు.
మూలాన సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం అందుకోలేకపోవడమైనది 80 సంవత్సరాల భారతదేశ చరిత్రలో డి ఎన్ టి కులాలకు రాజ్యాంగ హక్కులలో భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమైన విషయం పై బీసీ కమిషన్ చైర్మన్ గార్లతో చర్చించినట్లు తెలిపారు.నిరంజన్ ను కలిసిన వారిలో బోయ గోపి,నిమ్మల వీరన్న, జంగమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు .వినతి పత్రాన్ని సమర్పించారు.















