EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఈసారి కార్వాన్ అసెంబ్లీ నియోకవర్గం బీ జే పీ దే

 

హైదరాబాద్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్);ఈసారి ఎన్నికల్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని బీజేపీ పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థి టి అమర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కార్వాన్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఆయన ఓటర్లను నేరుగా కల్సుకుని కమలం పువ్వు గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అమరిసింగ్ మాట్లాడుతూ మోనార్కిస్ట్గా నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్న మజ్లిస్ పార్టీ నుంచి కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి విముక్తి లభించాలంటే ప్రతీ ఒక్క ఓటరు కమలం పువ్వు గుర్తుకే ఓటేసి బాజపా ఎమ్మెల్యేగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అమర్సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మజ్లిస్న కార్వాన్లో ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. అమర్సింగ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓటర్లను ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు, భారత ప్రధానమంత్రి. నరేంద్రమోదీ ముఖచిత్రాలను ధరించిన వందలాది మంది చిన్నారులు, యువకుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్వాన్ కన్వీనర్ గోవర్ధన్, యోగిరాజ్సింగ్, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top