ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 19:
_________________________________
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు చైతన్యపురి కమలానాగర్ చౌరస్తా లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డిహాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలంతా ఒకచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వాణి రెడ్డి పేర్కొన్నారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. రంగు రంగుల వస్త్రాలు దసరించిన మహిళలు పిల్లల భాగస్వామ్యంతో బతుకమ్మ వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి.















