ఈతరం భారతం అమరావతి అక్టోబర్ 19:
________________________________
పులస చేపల ధరలు రూ 500 నుంచి రూ.1200కే.. ! గోదావరిలో దొరికే పులస చేపల ధరలు తగ్గాయి.. సీజన్ ముగింపు దశకు రావడంతో సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కొద్దిరోజులుగా పులస చేపల ధరలు రూ.500 నుంచి రూ.1200 వరకు పలుకుతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి 30 వేల వరకు పలికిన పులస చేపల ధరలు ఇప్పుడు రూ.1200 వరకు పలుకుతున్నాయి. ఇటు చీరమేనుల ధర మాత్రం పెరిగింది. చీరమేనుల ధరలు తగ్గితే పులస చేపల ధరలు పెరుగుతాయంటున్నారు
గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి డిమాండ్ ఉంది. జూన్ నెల తర్వాత గోదావరికి వచ్చే వరద నీటిలో ఈ పులస చేపలు ఎదురీదుతూ కనిపిస్తాయి. ఈ చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది.. ఒక్కో చేప ధర రూ.20వేల నుంచి 30 వేల వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి పులసల చాలా తక్కువగా దొరికాయి.. దీంతో భారీ ధరలు పలికాయి. మొన్నటి వరకు రూ.20వేలకుపైగా ధర పలకగా.. తాజాగా యానాం మార్కెట్లోకి విక్రయానికి వస్తున్న పులస చేపల ధరలు తగ్గిపోయాయి. గత వారం కూడా యానాంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఓ పులస చేప ఏకంగా రూ.18 వేల ధర పలికింది.. వారంలోనే పరిస్థితి మారిపోయింది .పులస చేపల ధరలు తగ్గిపోయాయి. కొద్ది రోజులుగా చిన్న చేపలు లభ్యం అవుతుండటంతో ధరలు తగ్గాయి.















