EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్‌నినో రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి : పార్టీ శ్రేణులు, విపక్షాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

ఈ తరం భారతంహైద్రాబాద్ అక్టోబర్ 23;

ప్రజా భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యం లో పార్టీ ఎంఎల్ ఏ లు,ఎంఎల్సీ లు,ఎంపీ లు,డీసీసీ అధ్యక్షులు,ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు హాజరైనారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఎల్ ని నో,ఎంఎల్సీ ఎలక్షన్ పైన దిశా నిర్దేశం చేశారు

ఎల్‌నినోపై రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రీనులు విపక్షాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలు చేయడం విచారకరమన్నారు.కరోనా సమయంలో మోదీ పిలుపునకు స్పందించిన ప్రజలు.. ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదీ

‎విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు కాదు.. ప్రజలకు భరోసా ముఖ్య మన్నారు.

‎324 మండలాల్లో భూగర్భ జలాల కొరత..

‎రైతులను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులకు స్పందించి ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావడం సమంజసం కాదని హితవు పలికారు.

‎శుక్రవారం ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీసీసీ ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన ఎల్‌నినోపై అవగాహన, ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసి ప్రజలకు భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

‎విమర్శలు కాదు.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి

‎పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 324 మండలాల్లో భూగర్భ జలాల కొరత ఉన్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడం, నీటి వినియోగంపై అవగాహన కల్పించడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు.

‎కరోనా సమయంలో ప్రభుత్వాల పిలుపులకు ప్రజలు ఏ విధంగా సహకరించారో గుర్తు చేసుకోవాలని, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూడా అదే స్ఫూర్తితో సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే అంశాలపై సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని కోరారు.

‎324 మండలాల్లో భూగర్భ జలాల కొరత

‎వర్షాభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని, రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, ఈ నెలలో దాదాపు 15 లక్షల పంపుసెట్లు వినియోగంలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. బోరుబావుల్లో నీరు లేకపోయినా మోటార్లు ఆన్‌ చేయడంతో అవి కాలిపోతున్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు.

‎ఈ సమస్యను నివారించేందుకు భూగర్భ జలాల లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నీరు లేని ప్రాంతాలను గుర్తించి, మోటార్లు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.

‎రబీలో ప్రత్యామ్నాయ పంటలే మేలు

‎కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో వరి సాగుకు బదులుగా వ్యవసాయ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని భట్టి విక్రమార్క తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గినప్పటికీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో 20,018 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందని వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్‌, నీటి వినియోగంపై ముందస్తు ప్రణాళికలు అవసరమన్నారు.

‎ప్రజలకు తాగునీరు అందించడమే తొలి ప్రాధాన్యం

‎రానున్న రోజుల్లో ప్రజలు, పశువులు, పక్షులు సహా అన్ని జీవరాశులకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ప్రకృతి సవాళ్లను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం, వారికి భరోసా కల్పించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని స్పష్టం చేశారు.

‎

Related News

Select the Topic
Scroll to Top