హైదరాబాద్ నవంబర్ 16 (ఈతరం ఇండియా న్యూస్):ఎన్నికల వెళ కారు పార్టీకి షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుప్పల్ కార్పోరేషన్ ఐదుగురు కార్పొరేటర్లు కారు హస్తం అందుకున్నారు. గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి,20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పరతం లోకేష్ లు ఉన్నారు. బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు మంద సంజీవరెడ్డి, మంత్రి మల్ల రెడ్డి ఒంటెద్దు పోకడలు, ఏకపక్షన నిర్ణయాలకు విసిగి వేసారి వారు కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో మేడ్చల్ బి.బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,రచ్చ శ్రీనివాస్,రబ్బని తదితరులు పాల్గొన్నారు.

















