EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురిని చంపిన తల్లి

ఈతరం భారతం రంగారెడ్డి అక్టోబర్ 30:

_______________________________

రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని హనుమాన్ కాలనీలో ముగ్గురు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులుకల్లుకు బానిసై నిత్యం 9వ తరగతి చదువుతున్న తన కూతురు సువర్చల (14)తో విజయలక్ష్మి గొడవలు పడేదని సమాచారం.ఈ నెల 27వ తేదీన ఇంటికి తిరిగి వచ్చేసరికి సువర్చల ఫోన్ చూస్తూ కనిపించడంతో కోపంతో రగిలిపోయి కూతురి గొంతు నులిమి హతమార్చిన విజయలక్ష్మి.అనంతరం కూతురు మెడకు చీర చుట్టి, భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించిన తల్లి.ఇటీవలే పుష్పవతి కావడంతో కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబ సభ్యులు.అయితే పోస్టుమార్టం రిపోర్టులో తేడాలు, తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో హత్య కేసుగా మార్చి విచారించిన పోలీసులు.దీంతో తరచూ ఫోన్ చూస్తుందని, చెప్పిన మాట వినడం లేదని తానే కూతురిని హతమార్చినట్లు అంగీకరించిన విజయలక్ష్మి.

Related News

Select the Topic
Scroll to Top