ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 30:
__________________________________
తమ క్రెడిట్ కార్డుతో జరిపే హై వాల్యూ ట్రాన్స్పోర్ట్, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై 1% చొప్పున అదనపు ఛార్జ్ వసూలు చేస్తామని SBI కార్డ్ తెలిపింది. Dec 1 నుంచి ఒక్కో ట్రాన్స్పోర్టేషన్ లావాదేవీ ₹30 వేలు దాటితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓ బిల్లింగ్ సైకిల్లో పెట్రోల్/డీజిల్ లావాదేవీలు ₹50 వేలు దాటితే ఆ మొత్తంపై 1% ఛార్జ్ చేయనుంది. దీంతో వ్యాపార అవసరాలు, ప్రయాణాల కోసం కార్డు వాడే వారిపై భారం పడనుంది.















