ఈతరం భారతంహైద్రాబాద్ అక్టోబర్ 30:
________________________________
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజానర్సింహాని హైదరాబాద్ లో మినిస్టర్ క్వాటర్స్ లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు గారి ఆధ్వర్యంలో NHM ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రి కలిసారు. ఈ సందర్బంగా గత 18 రోజులుగా తెలంగాణ రాష్ట్రం లో NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె పై చర్చించడం జరిగింది. NHM ఉద్యోగుల సమ్మె పై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోతానని హామీ ఇచ్చారు.అలాగే సమ్మె పరిస్కారం కోసం నవంబర్ 2వ తేదిన మరో సారి భేటీ అయి సమస్యలు పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NHM ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేతలు డా. బి. సంజీవ్ నాయక్, డా. కరుణాకర్, డా. కుమార్ నాయక్, డా. రాజేశ్వర్, డా. నాగరాజు, డా. పుష్పలత, ఓయూ జేఏసీ చైర్మన్ డా. పురుషోత్తం పాల్గొన్నారు.















