ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 3
;ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటుపరం చేసే యోచనను విరమించుకోవాలని బీసీ బ్యాంక్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జాతీయ బిసి కమిషన్ చెర్ పర్సన్ స్వాతి నిరంజన్ జ్యోతిని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా అల్లం యాదయ్యమాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంకులో ప్రైవేటుపరం చేస్తున్నారని, ఐడిబిఐ ఉద్యోగులు దాదాపు పదివేల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాల బాట నడుస్తున్న ఐడి బ్యాంకు ప్రైవేట్ వరం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డిసెంబర్ లో జరుగు బీసీ ఉద్యోగుల సమావేశంలో దీనిమీద విస్తృతంగా చర్చించి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని మరియు ఫైనాన్స్ మినిస్టర్ కలిసి కలిసి వినతి పత్రము సమర్పించనున్నట్లు తెలిపారు. స్వాతి నిరంజన్ జ్యోతిని కలిసిన వారిలో ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు కురుమ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.















