ఈతరం భారతం అమరావతి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 3:
__________________________________________
పెడన మున్సిపల్ చైర్ పర్సన్‌గా పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థి బళ్ళ జ్యోత్స్నరాణి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిపై 4,380 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు.
కూటమి అభ్యర్థుల ప్రభంజనం..
పెడన మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 28 వార్డులకు గాను, ఏకంగా 26 వార్డులను అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కేవలం 11, 22 వార్డులలో మాత్రమే విజయానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న మున్సిపల్ పోరులో కూటమి అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, పెడనలో లభించిన ఈ విజయం జనసేన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.















