EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సూపర్‌ బ్లడ్‌తో వయసు తగ్గింపు బిలియనీర్‌ బ్రియాన్‌ జాన్సన్‌ సంచలన ప్రకటన

శాన్‌ఫ్రాన్సిస్కో, నవంబర్‌ 16(ఈతరం ఇండియా న్యూస్): టీనేజ్‌లో ఉండే ఉత్సాహం, శారీరక పటుత్వం.. వయసు పైబడ్డాక ఉండదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ బిలియనీర్‌ బ్రియాన్‌ జాన్సన్‌ వివాదాస్పద ‘మెడికల్‌ థెరపీ’ని తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఏటా 2 మిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. తన సూపర్‌ బ్లడ్‌ (ప్లాస్మా)తో తన తండ్రి(71) వయసును 25 ఏండ్లు తగ్గించినట్టు తెలిపారు. ‘నా రక్తంలోని ఒక లీటర్‌ ప్లాస్మాను మా నాన్నకు మార్పిడి చేశాను. దీంతో నా తండ్రి వయసు 25 ఏండ్లు తగ్గింది. ఇప్పుడు నా తండ్రి 46 ఏండ్ల వయసు వ్యక్తిలా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top