EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నిరుపేద మహిళల అక్రమ అండాల సేకరణపైమహిళా కమిషన్ ఆగ్రహం

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 7:

_______________________________

నిరుపేద మహిళల నుండి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంలో ఆసుపత్రులు, ల్యాబ్ లపై చర్యలు తీసుకోకపోవడం పై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేవలం కొంతమంది ఎజెంట్లపైనే కేసులు నమోదు చేసి.. ప్రధాన సూత్రధారలుగా ఆరోపణలు వస్తున్న ఆసుపత్రులపై, ల్యాబ్ లపై కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం పట్ల మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులు, సెంటర్లపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మహిళా కమిషన్ ఆదేశించినప్పటికి ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై మహిళా కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

బాధిత మహిళలను మహిళా కమిషన్ గౌరవ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద పరామర్శించినప్పుడు ప్రధానంగా ఇందిరా ఐవిఎఫ్ సెంటర్, నర్మద ఫర్టిలిటి సెంటర్, ఓయాసిస్ ఫర్టిలిటి సెంటర్, సద్గురు A R T సెంటర్, పద్మజ ఫర్టిలిటి సెంటర్లతో పాటు డాక్టర్ హుస్సేన్ పేరుప్రస్తావించి బాధితులు…ఫిర్యాదు చేసారు.కానీ ఇప్పటి వరకు డాక్టర్ హుస్సేన్ జాడ కనిపెట్టకపోవడం మరియు కనీసం కేసునమోదు చేయకపోవడం పైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులు మరియు ఐవిఎఫ్ సెంటర్లపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందింగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మహిళా కమిషన్ ఆదేశించినప్పటికి ఇప్పటివరకు అసలు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.మహిళల శారీరక స్వేచ్ఛ, గౌరవం, ఆరోగ్యానికి సంబంధించి అక్రమంగా వ్యవహరించినవారు ఎంతటి వారైనా వారిపైన కేసులు నమోదు చేయకుండా జాప్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయాని మహిళా కమిషన్ హెచ్చరించింది.

Related News

Select the Topic
Scroll to Top