EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే.!!

ఈతరం భారతం వార్తాంశం:

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది సుప్రీంకోర్టు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్టై.. 48 గంటలకు మించి పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయితే..ఆయనకు ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు లేకుండానే ఆటోమేటిగ్గా డీమ్డ్ సస్పెన్షన్ కింద పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వాల్సిన పని లేదని కోర్టు తేల్చి చెప్పింది. బిహార్‌లోని సమస్తిపూర్ సదర్ ఆసుపత్రి మేనేజర్‌కు సంబంధించిన లంచం కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఇదీ కేసు నేపథ్యం..

సమస్తిపూర్ సదర్ ఆసుపత్రిలో నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, తన జీతం చెల్లించడానికి రూ. 4,000 లంచం డిమాండ్ చేసినందుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద అరెస్టు అయ్యారు. సుమారు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో గడిపిన తర్వాత, సెషన్స్ కోర్టు అతడిని బెయిల్‌పై విడుదల చేసింది. అయితే, సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసి, అతడిని తిరిగి కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది. ఆ ఉద్యోగి హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టు తీర్పు… ఒక ప్రత్యేక ఉత్తర్వు:

సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసి, సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను పునరుద్ధరించింది. సాధారణంగా ఇటువంటి కేసులలో గరిష్ట శిక్ష ఆధారంగా బెయిల్ మంజూరు చేయాలని, నేర చరిత్ర లేదా తీవ్రతరం చేసే పరిస్థితులు లేకపోతే కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చని అది పేర్కొంది. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం, అరెస్టు తర్వాత 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండటం వల్ల, ఆ 48 గంటలను సస్పెండ్‌గానే పరిగణించాలని, దీనికి ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, సస్పెండ్ అయిన ఉద్యోగి సస్పెన్షన్‌ను కొద్ది రోజుల్లోనే ఎత్తివేసి, అతడిని అదే ఆసుపత్రిలో, అదే పోస్టులో తిరిగి నియమించడం పై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తక్షణమే పరిష్కరించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది.

Related News

Select the Topic
Scroll to Top