ఈతరం భారతం ఇంద్రకీలాద్రి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 10:
కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపం ఏర్పాటు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధితో పాటు శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో శ్రీ వి.కె. శీనా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు భక్తుల కోసం ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, వివిధ వైదిక సేవలను దేవస్థానం నిర్వహించనుంది.















