హైదరాబాద్ నవంబర్ 16 ( ఈతరం ఇండియా న్యూస్). శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 18-19 ఏళ్ల నవతరం ఓటర్లు 9,99,667 మంది ఉండగా, వీరిలో 5,70,274 మంది యువకులు, 4,29,273 మంది యువతులు ఉన్నారు.
















