ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 17:
దేశవ్యాప్తంగా ఉన్న 63 ఫైనాన్స్ కంపెనీలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక చర్యలు తీసుకుంది. ఇందులో 49 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFC) లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేయగా, మరో 14 సంస్థలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్లను వదులుకున్నాయి. అక్టోబర్ నెలలో జారీ చేసిన వివిధ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. లైసెన్స్ రద్దయిన కంపెనీలు ఇకపై ఆర్థిక సేవలు నిర్వహించడానికి వీల్లేదు.అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 29 మధ్య 49 ఎన్బీఎఫ్సీల లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. 13 ఎన్బీఎఫ్సీలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్వచ్ఛందంగా తమ లైసెన్సులను సరెండర్ చేశాయి.రిజిస్ట్రేషన్ కోల్పోయిన కంపెనీలు రుణాలు ఇవ్వడం లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు జరపడానికి అనుమతి లేదు.















