ఈతరం భారతం ఛత్తీస్గఢ్ నవంబర్ 17
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు.NOC ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.















