EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్ కి ఓటు వేస్తే భయాందోళనలతో బతకాల్సి వస్తుంది

రంగారెడ్డి: నవంబర్ 16 (ఈతరం ఇండియా న్యూస్  ); నోముల దయానంద్ గౌడ్ ని గెలిపించుకుందాం..ఇబ్రహీంపట్నంలో బిజెపి జెండా ఎగురవేద్దాం అని ఇబ్రహీంపట్నంలో బిజెపి ఎంఎల్ఏ అబ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పిలుపు నిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నోముల దయానంద్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ అభ్యర్థిని స్థానిక గ్రామాల ప్రజలే తిరగబడి తరిమికొడుతున్నారని, కాంగ్రెస్ పాలన కర్ఫ్యూల రాజ్యమని, కాంగ్రెస్ కి ఓటువేస్తే భయాందోళనలతో బ్రతకాల్సి వస్తుందని అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని బిఆర్ఎస్ అక్రమాలను అర్ధం చేసుకున్నారని, ప్రజలే బిఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడుతారని అన్నారు. అనంతరం బిజెపి మంచాల మండలాధ్యక్షులు గోవర్ధన చారి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నోముల దయానంద్ గౌడ్, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా భారాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద ప్రజలకు ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కనీసం అర్హులైన వారికి పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి బిజెపికి అవకాశం ఇద్దామని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా మాజీ అధ్యక్షులు పోరెడ్డి నర్సింహా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు వింజమూరి వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దన్నె బాషయ్య, అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి రెడ్డి, భువనగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ నారాయణ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి నూకం రాజు, గడ్డం రాజేందర్ రెడ్డి, తిప్పాయిగూడెం సర్పంచ్ శివరాల పాండు, నారెడ్డి నర్సింహా రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశ్రీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్, ఎస్సి మోర్చా అధ్యక్షుడు యాదయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు బండి రాజు, శక్తి కేంద్ర ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, శ్రీశైలం, భిక్షపతి, సొసైటీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top