ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 24
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య అందించనుంది.ఈ నిర్ణయంతో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలోని 9 పాఠశాలల్లో చదువుతున్న 400 మంది పిల్లలకు తక్షణమే ఉచిత విద్య వర్తించనుంది.వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కూడా ఈ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో మరింత మంది కార్మికులు తమ పిల్లలను సింగరేణి విద్యాసంస్థల్లో చేర్పించే అవకాశం ఉంది.కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు నాణ్యమైన విద్య అందించే అవకాశం కలగనుంది. ఈ నిర్ణయంపై కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.















