ఈతరం భారతం చెన్నై నవంబర్ 24:
తమిళనాడులో కల్లకురిచి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపిన ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు వెల్లడించారు.మహిళా న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేసు నమోదు, నిష్పక్షపాత దర్యాప్తు అంశాలు చర్చకు వచ్చాయి. మహిళా పోలీస్ స్టేషన్ విచారణ చేపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు.ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నందున ఎస్పీ స్థాయి కంటే పై అధికారితో దర్యాప్తు చేయించాలని కోర్టు సూచించింది. అసభ్య పోస్టులను తొలగించడంలో సైబర్ విభాగం చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించింది.
మహిళలపై వేధింపుల నిరోధక చట్టం (POSH) కింద కమిటీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించిన కోర్టు.. దర్యాప్తు బృందాల వివరాలు, కమిటీ ఏర్పాటు అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 27కి వాయిదా వేసింది.















