EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తండ్రి గెలుపు కోసం తనయుడి ఆరాటం..ఇంటింటి ప్రచారం

హైదరాబాద్ నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూస్);రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్వాన్ నుంచి తన తండ్రి కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆకాంక్షిస్తూ ఆయన తనయుడు అభిషేక్మిత్ర జియాగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మిత్రకృష్ణ లంగర్ హౌజ్, కార్వాన్, జియాగూడ మేకలమండీ పరిసర ప్రాంతాలలో ఇంటింటి ప్రచార పాదయాత్ర నిర్వహించగా, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన తనయుడు అభిషేక్మిత్ర జియాగూడలోని దుర్గానగర్, సాయిదుర్గానగర్, జనాబ్ గల్లీ, ఇమాంపురా తదితర ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను, మహిళా కార్యకర్తలను వెంటతీసుకుని అభిషేక్ మిత్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తండ్రీకొడుకుల ప్రచారం ఏకకాలంలోనే వేర్వేరు ప్రాంతాలలో కొనసాగింది. అభిషేక్ మిత్ర జియాగూడలో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకుని తన తండ్రి, మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ గతంలో జియాగూడ కార్పొరేటర్గా ఎంతో అభివృద్ధి చేశారని, జియాగూడ బల్దియా క్వార్టర్స్ స్థానంలో ప్రభుత్వాన్ని ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చారని, జియాగూడలో బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు ఇంకా అనేక అభివృద్ధి పనులను ఆయన హయాంలోనే పూర్తి చేయించారని ప్రజలకు గుర్తుచేయించారు. జియాగూడ పురోభివృద్ధికి పాటుపడిన తన తండ్రి మిత్రకృష్ణను కార్వాన్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్వాన్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. అభిషేక్ మిత్ర ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి కూడా విశేష స్పందన లభించడమే కాకుండా స్థానికులు కూడా పలువురు మిత్రకృష్ణ, అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top