EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జోరుగా సాగుతున్న బీర్ల ఐలయ్య ప్రచారం

 

యదాద్రి భువనగిరి నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూస్ );అన్ని రంగాల వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్లఐలయ్య ప్రచారం జోరుగా వినిపిస్తుంది.మండలంలోని ఫకీరు గూడెం,మేడిపల్లి,మైలారం,మైలరంతాండ,నాగినేనిపల్లి,తిరుమలగిరిసిరెడ్డిపల్లి,హాజీపూర్,ధర్మారెడ్డిగూడ, మల్యాల, బొమ్మలరామారం,పెద్ద పర్వతాపురం,పాత రంగాపురం, కొత్త రంగాపురం,రామలింగంపల్లి,తూముకుంట,బండకింది పల్లి, బండకాడిపల్లి,జలాల్ పురం,యావపురం,గ్రామంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమనికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ..ఈ ప్రచారంలో మండలంలోని ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఖ్యలో సంఖ్యలో హాజరయ్యారు..

కాంగ్రెస్ పార్టీ లోకి చేరికల జోష్

అండెం సంజీవరెడ్డి,బీర్ల ఐలయ్య,సమక్షంలో తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ సర్పంచ్ మంగ్య నాయక్ తో పాటు వార్డు సభ్యులు,బొమ్మాలరామారం మండలం మైలారం తాండ సర్పంచ్ సరియా తో పాటు వార్డు సభ్యులు..బొమ్మాలరామారం మండల మాజీ ఎంపీపీ కౌసల్య.గుండాల మండలం బ్రాహ్మణపల్లి,వంగాల,రాజపేట మండలం చల్లురు,తో పాటు పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,బిఅరెస్ బిజెపి,పార్టీ ల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ ఎన్నికల్లో బీర్ల ఐలయ్య గారిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సునీత పాలన పైమండిపడ్డారు,బొమ్మాలరామరం మండలం హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న ఏలంటి అభివృద్ధి చేయలేదన్నారు.మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు గా ఉన్నాయని,ఈ రోడ్ల వెయ్యలేని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,అలేరు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తావని ప్రశ్నించారు.ఎమ్మెల్యే గెలవగానే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.లింకురోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని బీర్ల ఐలయ్య తెలిపారు ఈ సారి చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆరు గ్యారెంటీ లను ప్రజలకు వివరించారు

Related News

Select the Topic
Scroll to Top