EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మతతత్త్వ మజ్లిస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా బీజేపీదే విజయం కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి అనర్సింగ్ ధీమా

 

హైద్రాబాద్. నవంబర్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్);మతతత్త్వ మజ్లిస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఈసారి కార్వాన్లో బీజేపీ విజయాన్ని  అడ్డుకోలేరని కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి అనర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించిన చరిత్ర ఒక్క బీజేపీ పార్టీకే ఉందని, ఆ రికార్డును ఈసారి భాజపా పునరావృతం చేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా తిరిగి ఎగరవేస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అమరసింగ్ జియాగూడ డివిజన్లోని పురానాపూల్, ఇక్బాల్గంజ్, వెంకటేశ్వరనగర్, భీమ్ నగర్ చౌరస్తా, భగత్ సింగ్ వీధి, దుర్గానగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కల్చుకుని కమలం పువ్వు గుర్తుకే ఓటేసి కార్వాన్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అమర్సింగ్కు జియాగూడ ప్రజలు వాడ వాడలా హారతులిచ్చి సన్మానాలతో ఘన స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటించారు. అమర్సింగ్ జియాగూడలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికీ నివాళులర్పించారు. దోశలు వేస్తూ, దర్జీ షాపులో బట్టలు కుడుతూ ఓటర్ల నాడీని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా కార్వాన్ కన్వీనర్ గోవర్ధన్, యోగిరాజెసింగ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top