EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఫలించనున్న బిసి సీఎం నినాద అస్త్రం… మలుపు తిరగనున్న మాదిగల ఏ బి సి డి వర్గీకరణ “హామీ మంత్రం”… బహుజన వర్గాల్లో.. ఆశాజనకం..భాజాపా వైపే దళిత బహుజన సమాజం

పట్నం”..” నగరం” “”మహేశ్వరం”.. కమలం అస్తగతం.. తొలిసారిగా ఈ నియోజకవర్గాలలో విజయదుందుభి మ్రోగించనున్న బిజెపి అభ్యర్థులు…చాప క్రింద నీరులా “ప్రచారం” యమ స్పీడ్ లో…ప్రత్యర్ధులకే అంతు చిక్కని వైనం…

(బోయపల్లి లక్ష్మీనారాయణ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్ )

రంగా రెడ్డి జిల్లా :తెలంగాణ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో,జిహెచ్ఎంసి ఎన్నికల్లో బలపడిన భాజపా సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పకడ్బందీ, వ్యూహాలు రచించడం తద్వారా ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విధంగా పన్నాగంలో ఉన్నా రని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. ఎత్తుగడలతో ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సంకల్పం ఆ పార్టీ దృఢ సంకల్పమని స్పష్టంమౌతుంది . దానికి అన్ని అస్త్ర,శస్త్ర ఉపాయాలు, పన్నాగాల, ప్రజా క్షేత్రానికి దగ్గర అయ్యే మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ రెండు సమావేశాలు ఆ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చాయని చెప్పవచ్చు . ఆ పార్టీ శ్రేణులు అందరిలో కొత్త ఆశలు చిగురించాయి ఇది జనం మాట. మొత్తానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి అందెల శ్రీరాములుయాదవ్, ఇబ్రహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్ ఎల్బీనగర్ నుంచి సామ రంగారెడ్డి కరుడుగట్టిన బిజెపి సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో బరిలో నిలిచి ప్రచారంలో అందరికంటే ముందు అలర్ట్ గా ఉన్నారని సమాచారం. వీరు ప్రతినిత్యం అహోరాత్రులు తమ విజయం కోసం పరితపిస్తూ నిర్విరామంగా కష్టపడుతున్నారు . బీసీ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఉద్యోగులు, ని నిరుద్యోగులు,యువత మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సంధ్య సమయము నుండి మొదలుకొని సాయంత్రం చివరి వరకు వీరి ప్రచార కార్యక్రమం జోరుగా, హోరుగాకొనసాగుతూ.. ప్రజల ఆదరణను చూరగొంటున్నట్టు ప్రచారం నడుస్తోంది… పార్టీ అగ్ర నాయకుల మరో రెండు,మూడు,పర్యాయాలు హైదరాబాదులో సభలు నిర్వహిస్తే , అటు తరువాత పార్టీ మేనిఫెస్టో గనక ప్రకటిస్తే రాబోయే 10 రోజుల్లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనబడుతుందని బిసి సామాజిక వర్గానికి చెందిన రాజకీయ మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగులు నిరుద్యోగులు యావత్ బహుజన సమాజం పలువురు భావిస్తోంది

Related News

Select the Topic
Scroll to Top