మక్తల్ నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్);మక్తల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ సమావేశం జరిపారు. ఈ సందర్బంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు ఎన్నికల ప్రచార సరళిపై, గ్రామ సమస్యలపై సమీక్షించారు.కెసిఆర్ గారి చేసిన సంక్షేమాన్ని గడప గడపకి వివరించాలని, బిఆర్ఎస్ పార్టీ, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి గెలుపె లక్ష్యం గా అందరూ కలసి పనిచేయాలని అని డాక్టర్ ఆంజనేయ గౌడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు
















