హైదరాబాద్ డిసెంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్ );తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదర్శ సంస్థల అధినేత వంగాల బాలరాజు గౌడ్ మంగళవారం ఆయన నివాసం లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా బాలరాజు గౌడ్ బాల్రాజ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా మంచి గుర్తింపు పొందిన పొన్నం సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి మంత్రి వర్గం లో సముచిత స్తానం సంపాదించారని ఆయన పేర్కొన్నారు. బీసీలకు కోసం బీసీల సమస్యల కోసం ఒక సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు స్వీకరించి వాటి అమలుకు కృషి చేయాలని కోరారు. అలాగే గౌడకులస్తుల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆదర్శ కిరణం పక్షాన వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహోసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు.
















