EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మున్సిపల్‌ కమిషనర్‌ కు ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష

అమరావతి డిసెంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్);: ఓ కేసు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించ లేదని ఆరోపిస్తూ గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ కు ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకుని ఎటువంటి లీజ్‌ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పిటిషనర్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను మున్సిపల్‌ కమిషనర్‌ అమలు చేయడం లేదని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని పిటిషనర్‌ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు గుంటూరు కమిషనర్‌ కీర్తి చేకూరికి నెలరోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రెండువేల జరిమానా చెల్లించాలని, జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది

Related News

Select the Topic
Scroll to Top