EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారం

 

భోపాల్‌ డిసెంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ ): మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్‌లో గవర్నర్‌ మంగుభాయ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇదే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులుగా రేవా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్‌ దేవరా ప్రమాణం చేశారు.ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు భోపాల్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు మోహన్ యాదవ్. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్ దీన్దయాళ్ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

Related News

Select the Topic
Scroll to Top