న్యూఢిల్లీ డిసెంబర్ 13 (ఈతరం ఇండియా న్యూ స్);: పార్లమెంట్‌లో భద్రతను ఉల్లంఘించి లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకుల వద్ద ఉన్న పాస్‌లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా జారీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీ ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సంతకం చేసిన పాస్‌లను పోలీసులు కనుగొన్నారు. బుధవారం లోక్‌సభలోకి దూకి అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి ఎంపీ ప్రతాప్ సింహా నియోజవర్గంతో సంబంధం ఉంటుందని అనుమానిస్తున్నారు. లోక్‌సభలో కలకలం సృష్టించిన ఆగంతకుల్లో ఒకడైన 35 ఏళ్ల డీ మనోరంజన్, బెంగళూరులోని మైసూర్ వివేకానంద విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సంతకంతో కూడిన విజిటర్ పాస్‌ను అతడితోపాటు మరో చొరబాటుదారుడైన సాగర్ శర్మ ఎలా పొందారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
















