EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక రోడ్డులో అమర వీరుల స్థూపం తెలంగాణ ఉద్యమకారుల కమిటీ కి సిఎం రేవంత్ రెడ్డి హామీ

 

హైదరాబాద్ డిసెంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ )ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక రోడ్డులో అమర వీరుల స్థూపం నిర్మాణానికి తెలంగాణ ఉద్యమకారుల కమిటీ తరఫున సమర్పించిన వినతి పత్రం పై గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల కమిటీ అద్యక్షులు బండి రమేష్, 1969 ఉద్యమకారుడు ఉప్పు సుధాకర్ హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో లొ ఉన్నట్లే 250 గజముల స్థలము మరియు ఫించను ఇచ్చే విధానాన్ని త్వరలో ఆమలు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తమకు జవాబు ఇచ్చారని తిలిపారు.. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక రోడ్డులో అమర వీరుల స్థూపం నిర్మిస్తామని చెప్పారు.ఎన్నికల సందర్బంగా ఇచ్చిన అమలుపరుస్తామని హామీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి బండి రమేష్ మరియు ఉప్పు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top