పశ్చిమగోదావరి జిల్లా, డిసెంబరు 15 శుక్రవారం,2023(ఈతరం ఇండియా న్యూస్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మం డలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంఎల్‌సి షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
ఎంఎల్‌సి కారును మరో కారు ఢీకొట్టడంతో ఎంఎల్‌సి సాబ్జీ,దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సాబ్జీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.సాబీ మృతిపట్ల సిఎం జగ న్ మోహన్ రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు ది గ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ గన్ మెన్ తీవ్రంగా గాయ పడ్డారు.
గాయపడిన గన్ మెన్ ను స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. శుక్రవారం ఉదయం ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో ఆయన పాల్గొని భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది…
















