EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుంది.. పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో .. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల .. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం.. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే దిశ‌గా కృషి .. బాధ్య‌త‌లు స్వీక‌రించిన 48 గంట‌ల్లోనే రెండు గ్యారెంటీలు అమ‌లు.. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి.. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల విద్యుత్ కు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం.. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ .. అసైన్డ్, పోడు భూముల‌కు త్వ‌ర‌లోనే ప‌ట్టాల పంపిణీ చేప‌డుతాం.. ఏడాది లోపు మా ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తుంది.. ఆరు నెల‌ల్లో మెగా డీఎస్సీ నిర్వ‌హించి, ఉపాధ్యాయ ఖాళీల‌ భ‌ర్తీ .. · ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

హైదరాబాద్ డిసెంబర్ 15 (ఈతరం ఇండియా న్యూ స్); : పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని… పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు.

రాష్ట్రంలో ఏర్ప‌డ్డ కొత్త ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ అభింద‌న‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరాల‌ని కోరుతున్నా. ప్ర‌జాసేవ‌లో విజ‌యం సాధించాల‌ని కొత్త ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే దిశ‌గా కృషి చేస్తాం. ప్ర‌జా ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ప్ర‌జావాణి చేప‌ట్టాం. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌ని కోరుకుంటున్నాను. రైతులు, యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంది. ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాలి. ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించాం. హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తిమాట‌కు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.

బాధ్య‌త‌లు స్వీక‌రించిన 48 గంట‌ల్లోనే రెండు గ్యారెంటీలు అమ‌లు చేశాం. వ‌చ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమ‌లుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాం. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి హామీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌జల ఆరోగ్య భ‌ద్ర‌త‌.. మా ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్ ఆరోగ్య‌శ్రీని ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తీర్చిదిద్దాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిధిని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచాం. ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ప్ర‌క‌టించిన అన్ని డిక్ల‌రేష‌న్లు అమ‌లు చేస్తాం. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి ఇస్తాం. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంది. అసైన్డ్, పోడు భూముల‌కు త్వ‌ర‌లోనే ప‌ట్టాల పంపిణీ చేప‌డుతాం అని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా యువ‌త‌కు మేం ఇచ్చిన ప్ర‌తి మాట‌ను నెర‌వేర్చుతాం అని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు. ఏడాది లోపు మా ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తుంద‌ని, ఆరు నెల‌ల్లో మెగా డీఎస్సీ నిర్వ‌హించి, ఉపాధ్యాయ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. రైతులు, పేద‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళ‌, యువ‌త‌, అమ‌ర‌వీరుల కుటుంబాలు, ఉద్య‌మ‌కారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్ర‌తీ వ‌ర్గాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచ‌ర‌ణ ఉంటుంది. యువ‌త జాబ్ క్యాలెండ‌ర్ విష‌యంలో చెప్పిన మాట ప్ర‌కారం కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేసాయని తెలిపారు. కార్య నిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అనిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని.. కార్యచరణ రూపొందిస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది.

Related News

Select the Topic
Scroll to Top