హైదరాబాద్ డిసెంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్ );సచివాలయంలో మెడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు.సమావేశంలో పాల్గొన్న ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు..ఎల్.అండ్ టి ప్రతినిధులపై చేసిన మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీసిన మంత్రి ఉత్తమ్..ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని అన్నారు.పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు..అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవమవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు
















