EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఢిల్లీ లిక్కర్ కేసు లో కీలక పరిణామం

 

న్యూ ఢిల్లీ డిసెంబర్ 18 (ఈతరం ఇండియా న్యూ స్);: ఢిల్లీ లిక్కర్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భార్య అనారోగ్య కారణంగా పిళ్ళైకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. పిళ్ళై అప్రూవర్‌గా మారతారని ప్రచారం జరిగింది. కాగా వాటిని పిళ్ళై తరపు న్యాయవాది ఖండించారు. గతంలోనే అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ మారిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోపు కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. త్వరలోనే మరో‌చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ కేసు రానున్నది. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి దర్యాప్తులో వేగం పెంచే యోచనలో దర్యాప్తు సంస్థలు ఉన్నట్లు సమాచారం. మరొకసారి ఈ కేసులో లింకు ఉన్న పలువురిని ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసే యోచనలో ఈడీ వర్గాలు ఉన్నాయి.

Related News

Select the Topic
Scroll to Top