EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వైసీపీ ఇన్చార్జీల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు

 

అమరావతి డిసెంబర్ 19 (ఈతరం న్యూ స్);: వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జిల మార్పుపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కసరత్తు కొనసాగుతోంది. ఈరోజు మరికొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎంను మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తూగో. జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కలిశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ చర్చిస్తున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్‌చార్జీలను వైసీపీ అధినేత ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు విషయమై అభ్యర్థులకు సీఎం జగన్ స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Related News

Select the Topic
Scroll to Top