EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోంది టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు

 

అమరావతి డిసెంబర్ 20 (ఈతరం న్యూస్ );: ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు.. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అరాచకపాలనపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు యువగళానికి బ్రహ్మరథం పట్టారన్నారు. యువగళాన్ని ఆపేందుకు వైసీపీ లైసెన్స్‌డ్ గూండాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువనేత ముందుకు కదిలారే తప్ప… ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. సైకో పాలనలో ప్రజాస్వామ్యయుతమైన పాలన కనుమరుగైందన్నారు. యువగళంతో నారా లోకేష్ జనహృదయనేతగా పేరు తెచ్చుకున్నారని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని ఎంఎస్ రాజు అన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top