EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్యాస్ కేవైసి కి గడువు ఉంది పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశీల్దార్ మాచన రఘునందన్

 

తుక్కుగూడ డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);వంట గ్యాస్ కోసం కే వై సీ కి వివరాలు సమర్పించేoదుకు వినియోగదారులు అనవసరంగా కంగారు పడవద్దని గడువు లోగా సమర్పించే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు బుధవారం నాడు ఆయన తుక్కు గూడ లో జాతీయ రహదారి పై ఉన్న వినియోగదారుల సేవా కేంద్రం ను తనిఖీ చేశారు.సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఉజ్వల గ్యాస్ వినియోగదారుల కే వై సీ నమోదుకు ఈ నెల డిసెంబరు ఆఖరు వరకు గడువు ఉందని తెలిపారు.అలాగే సాధారణ గ్యాస్ వినియోగదారులు వచ్చే ఏడాది మార్చి వరకు తమ వివరాలు సమర్పించే వెసులుబాటు ఉందన్నారు.కే వై సీ కి ఎటువంటి రుసుము చెల్లించ నవసరం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా ,ఎక్కడైనా అక్రమంగా డబ్బు వసూలు చేస్తే పోలీసులకు స్థానిక తాశీల్దార్ కు ఫిర్యాదు చేయాలని డి టి రఘునందన్ సూచించారు

Related News

Select the Topic
Scroll to Top